Nirmal: చందాపూర్‌లో భూముల రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా!

Nirmal: భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం. ముధోల్ మండలం చందాపూర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన.

Srinivas, Mondol Bhainsa
Published on: 4 Nov 2026 7:21 AM IST
Nirmal
X

Nirmal: చందాపూర్‌లో భూముల రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా!

Nirmal: భూముల రీ సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా నిర్వహించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ముధోల్ మండలం చందాపూర్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే ప్రక్రియను మంగళవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని మొత్తం పట్టా భూముల విస్తీర్ణం, సాగునీటి వసతులు ఉన్న భూములు, ఇతర భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూముల సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా భూ హద్దులను కచ్చితంగా గుర్తించాలని సూచించారు. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రీ సర్వే చేపట్టాలని తెలిపారు. సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ శ్రీలత, సర్వే అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa