Basara: ట్రిపుల్ ఐటీలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు..కలెక్టర్!
Basara: బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కొరతపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మీడియా సమావేశం నిర్వహించారు.
Basara: ట్రిపుల్ ఐటీలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు..కలెక్టర్!
Basara: బాసర ట్రిపుల్ ఐటి లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మీడియా సమావేశం. మిషన్ భగీరథ, బాసర త్రిబుల్ ఐటీ, గ్రామపంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మోటార్లు చెడిపోయాయని మీడియా ద్వారా నా దృష్టికి రాగానే 8 లక్షల రూపాయలతో మోటార్ల మరమ్మతుల కోసం కేటాయించిన జిల్లా కలెక్టర్.
ఐదు రోజుల్లోపు విద్యార్థులకు త్రిబుల్ ఐటీ లో యధావిధిగా తరగతులు నిర్వహించేలా చర్యలు చేపడతున్నారు. గోదావరి నది వద్ద ప్రస్తుతం మూడు మొటార్లలో రెండు మోటార్లు చెడిపోయాయి ఒక మోటార్ తో ట్రిపుల్ ఐటికి నీటిని సరఫరా చేస్తున్నాం. మరో మూడు మోటార్లను నూతనంగా తెప్పిస్తున్నామని ఒక్కో మోటారు 60 hp సామర్థ్యం కలిగినవని భవిష్యత్తులో బాసర ఐఐఐటి విద్యార్థులకు నీటి కొరత రానివ్వకుండా చర్యలు చేపడుతున్నాం అని తెలిపిన కలెక్టర్ భవేష్ మిశ్రా.
గ్రామపంచాయతీ మోటార్ ని కూడా వాడుకొని నీటి కొరత లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నాం. బాసర త్రిబుల్ ఐటీ లో విద్యార్థులకు, సిబ్బంది కి రోజుకు 25 లక్షల లీటర్ల నీళ్లు కావాలి. ప్రస్తుతం 10 లక్షల లీటర్ల నీళ్లే అందుతున్నాయి: భవేష్ మిశ్రా. బాసర త్రిబుల్ ఐటీ లో 30 ఎకరాలలో ఉన్న వాటర్ స్టోరేజ్ చెరువును పునరుద్ధరించి నీటిని స్టోరేజ్ చేస్తాం అని తెలిపిన జిల్లా కలెక్టర్ భవేశ్ మీశ్రా.




