Nirmal: నిర్మల్‌లో మారథాన్ జోష్‌.. పరుగులు తీసిన కలెక్టర్ భవేష్ మిశ్రా!

Nirmal: నిర్మల్ శివాజీ చౌక్ నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యువజనోత్సవాల్లో భాగంగా మారథాన్ రన్ నిర్వహించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 18 May 2026 11:44 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో మారథాన్ జోష్‌.. పరుగులు తీసిన కలెక్టర్ భవేష్ మిశ్రా!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతిప్రణాళిక యువజనోత్సవాల్లో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని నిజం చేస్తూ మారథాన్ రన్ నిర్వహించారు. ఈ మారథాన్ రన్ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక శివాజీ చౌక్ నుండి ఎన్టిఆర్ మినీస్టేడియం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తితో పాటు ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు , ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడం, యువతలో క్రీడాస్ఫూర్తిని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. మారథాన్ రన్ శారీరకంగా మరియు మానసికంగా మనిషికి అనేక ప్రయోజనాలు అందిస్తుందని, రోజువారీ వ్యాయామం, సమయపాలన వంటి మంచి అలవాట్లు పెరుగుతాయన్నారు. ఆరోగ్యం, పర్యావరణం, సామాజిక సేవ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కలుగ జేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారథాన్ రన్ నిర్వహిస్తుందని తెలిపారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story