Nirmal: చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలన క్షుణ్ణంగా జరపాలి

Nirmal: నిర్మల్ జిల్లాలో చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా జరపాలని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టమైన ఆదేశాలు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 10 Nov 2026 8:28 PM IST
Nirmal
X

Nirmal: చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలన క్షుణ్ణంగా జరపాలి

నిర్మల్: చేయూత పింఛను దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ క్షుణ్ణంగా జరగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చేయూత పింఛను దరఖాస్తుల పరిశీలన ప్రక్రియపై ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పింఛను దరఖాస్తుల వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్హులందరికీ పింఛన్ వచ్చేలా చూడాలని అన్నారు. అదే సమయంలో అనర్హులకు పింఛన్లు మంజూరు కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పరిశీలన జరపాలని ఆదేశించారు.

పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయికి వెళ్ళి పారదర్శకంగా సరిచూడాలని సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయోవృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీల వారీగా వచ్చిన వివరాలను, ఆధార్, రేషన్ కార్డు తదితర ధ్రువీకరణ పత్రాలను నిశితంగా తనిఖీ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

దరఖాస్తుల పరిశీలనలో ఎటువంటి సందేహాలు ఉన్న పై అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL