Nirmal: ఇండో-శ్రీలంక సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు
Nirmal: డిసెంబర్ 22న నిర్మల్ జిల్లాకు చేరుకోనున్న ఇండో-శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
Nirmal: ఇండో-శ్రీలంక సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు
నిర్మల్: ఇండో–శ్రీలంక మైత్రి సేతు అంతర్జాతీయ సైకిల్ యాత్రలో భాగంగా డిసెంబర్ 22న నిర్మల్ జిల్లాకు చేరుకోనున్న సైక్లింగ్ బృందానికి ఘన స్వాగతం పలికేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
జిల్లాకు చేరుకునే సైక్లింగ్ బృందానికి తగిన వసతి, ఆతిథ్య సౌకర్యాలు కల్పించాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. సైకిల్ యాత్ర ఆదిలాబాద్ జిల్లా వైపు వెళ్లేందుకు అనువైన రూట్ మ్యాప్‌ను రూపొందించాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్ర వంటి అంతర్జాతీయ కార్యక్రమాలు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. యాత్ర విజయవంతంగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, ఏఎస్పీ ఉపేంద్ర రెడ్డి, డీఎంహెచ్‌వో రాజేందర్, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, 32వ బెటాలియన్ ఎన్‌సీసీ ప్రతినిధి సంజీవ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




