Nirmal: నిర్మల్‌లో కలెక్టర్ రన్.. జనాభా గణనపై అదిరిపోయే అవగాహన!
Nirmal: నిర్మల్‌లో జనాభా గణన 2027 అవగాహన మరథాన్. కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు.
Nirmal: నిర్మల్‌లో కలెక్టర్ రన్.. జనాభా గణనపై అదిరిపోయే అవగాహన!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు జనాభా లెక్కలు గృహ ఆపరేషన్ 2027 ను పురస్కరించుకొని మరథాన్ రన్ ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులు, ప్రజలచేత జనాభా గణనపై ప్రమాణం చేయించారు. అనంతరం కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్వీయ గణన నమోదు సమయంలో నిష్పక్షపాతంగా ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలన్నారు. ఈ నమోదు ప్రక్రియ ఆన్లైన్లో స్వతహాగా, మొబైల్ ఫోన్లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎవరికైనా అర్థం కాకపోతే సహాయకుడి చేత జనగణనను నమోదు చేయించుకోవాలన్నారు. స్వయంగా వివరాలు నమోదు చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని, అలాగే తప్పులు తగ్గి కచ్చితమైన సమాచారం లభిస్తుందన్నారు.




