Nirmal: నిర్మల్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం!

Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. డీఆర్‌డీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో వయోవృద్ధులకు ఆర్థిక స్వావలంబనపై అవగాహన కల్పించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 13 Oct 2026 6:24 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం!

నిర్మల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 189 మంది వయోవృద్ధులు స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారిని విజయలక్ష్మి మాట్లాడుతూ వయోవృద్ధులు స్వయం సహాయక సంఘాలలో చేరడం వల్ల చేకూరే ఆర్థిక, సామాజిక ప్రయోజనాలపై ఈ సందర్భంగా వారికి సమగ్రమైన అవగాహన కల్పించారు.

వయోవృద్ధులలో పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్థిక స్వావలంబన సాధించడం, సంఘాల ద్వారా పరస్పర సహకార ప్రాముఖ్యతను వివరించారు. వారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లభించే రకరకాల ప్రయోజనాలను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేశారు.

వయోవృద్ధులతో బతుకమ్మలను స్వయంగా తయారు చేయించి, వారితో బతుకమ్మ ఆటపాటలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది, వయోవృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL