Dasturabad: కొత్తగూడెంలో దేవీ నవరాత్రులు: లక్కీ డ్రాలో దంపతుల విజయం!
Dasturabad: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం కొత్తగూడెంలో దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రాలో బొప్పిశెట్టి గంగాధర్, నీరజ దంపతులు విజేతలుగా నిలిచారు.
Dasturabad: కొత్తగూడెంలో దేవీ నవరాత్రులు: లక్కీ డ్రాలో దంపతుల విజయం!
దస్తురాబాద్: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని కొత్తగూడెంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. నవరాత్రి వేడుకల్లో భాగంగా ఈరోజు నిర్వహించ తలపెట్టిన అమ్మవారి శోభయాత్రకు ముందు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రాలో స్థానిక దంపతులు బొప్పిశెట్టి గంగాధర్, నీరజ విజేతలుగా నిలిచారు.
లక్కీ డ్రాలో తమ పేరు రావడంతో ఆ దంపతులు అమితానందం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ఆ జగన్మాత ఆశీస్సులు తమపై ఉన్నాయని, అందుకే ఈ అదృష్టం వరించిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అమ్మవారి పవిత్ర కలశాన్ని, నవధాన్యాల మొలకలను తలపై ఎత్తుకొని మంగళవాయిద్యాల నడుమ తమ నివాసానికి తరలించారు. ఈ దృశ్యాలు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.




