Nirmal: ఈదురుగాలులకు రహదారిపై కూలిన భారీ చెట్టు!
Nirmal: దస్తురాబాద్ మండలం రేవోజీపేట-బుట్టాపూర్ రహదారిపై కూలిన భారీ వృక్షం: రాత్రి వేళ స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసిన యువ సర్పంచులు మహేష్, నరేష్.
Nirmal: ఈదురుగాలులకు రహదారిపై కూలిన భారీ చెట్టు!
నిర్మల్: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో రేవోజీపేట మరియు బుట్టాపూర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఒక్కసారిగా వీచిన ఈదురుగాలుల ధాటికి ఓ పెద్ద చెట్టు కూలిపోయింది. రహదారికి అడ్డంగా చెట్టు పడిపోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చీకటి పడుతున్న సమయం కావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రయాణికులు ఉండిపోయారు.ఈ సమాచారం అందిన వెంటనే రేవోజీపేట, బుట్టాపూర్ గ్రామాల యువ సర్పంచులు మహేష్, నరేష్‌లు తక్షణమే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రామస్థులను, యువకులను వెంటబెట్టుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రాత్రి సమయమని కూడా చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగి గ్రామస్థుల సహాయంతో రహదారిపై పడిన చెట్టు కొమ్మలను వేగంగా తొలగించారు. యువ సర్పంచులు మరియు గ్రామస్థుల సమిష్టి కృషితో కొద్దిసేపట్లోనే రహదారి పూర్తిగా క్లియర్ అయింది.
రవాణా సౌకర్యం యధావిధిగా సాగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి తమకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసిన యువ సర్పంచులు మహేష్, నరేష్‌లకు, గ్రామ ప్రజలకు వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




