Nirmal: నిర్మల్లో ఏసీబీకి చిక్కిన డీసీటీవో, సీనియర్ అసిస్టెంట్!
Nirmal: నిర్మల్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో డీసీటీవో గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
Nirmal: నిర్మల్లో ఏసీబీకి చిక్కిన డీసీటీవో, సీనియర్ అసిస్టెంట్!
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ జిల్లా స్థాయి అధికారి తో పాటు సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు దాడులు చేసి లంచం తీసుకుంటున్న ఇద్దరిని పట్టుకున్నారు.
మంచిర్యాల పట్టణ కేంద్రంలో వ్యాపారి జ్యువెలర్స్ దుకాణం నడుపుతున్నారు. అయితే 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన పన్నును తగ్గించేందుకు డిసిటిఓ గోదావరి లక్ష రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు. సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో డిసిటిఓ గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
వీరి వద్ద నుండి 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిని కరీంనగర్ లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరు పరిచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని కోరారు.




