Nirmal: నిర్మల్ జిల్లాలో ఘనంగా నాగుల పంచమి, శ్రావణ సోమవార వేడుకలు!

Nirmal: నిర్మల్ జిల్లాలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, కదిలి పాపహరేశ్వరాలయంలో భక్తుల రద్దీ.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 17 Aug 2026 11:18 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లాలో ఘనంగా నాగుల పంచమి, శ్రావణ సోమవార వేడుకలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో నాగుల పంచమి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్దల నడుమ జరుపుకున్నారు. భక్తులు ఉదయం నుంచి పుట్టల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టల్లో పాలు పోసి నాగదేవతకు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు ప్రత్యేక పాయసాన్ని తయారుచేసి నైవేద్యాలు సమర్పించారు.

తమ కుటుంబ సభ్యులను ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. అదేవిధంగా శ్రావణమాసం తొలి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కదిలి పాప హరేశ్వరాలయం, కాల్వ నరసింహస్వామి ఆలయం, నిర్మల్లోని నగరేశ్వర ఆలయం, శివకోటి మందిరం, ఓంకారేశ్వరాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story