Nirmal: ఓటు హక్కుపై అవగాహనకు వ్యాసరచన, క్విజ్ పోటీలు
Nirmal: నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు. నవంబర్ 13న నిర్మల్ భాగ్యనగర్ నారాయణ హైస్కూల్‌లో నిర్వహణ.
Nirmal: ఓటు హక్కుపై అవగాహనకు వ్యాసరచన, క్విజ్ పోటీలు
నిర్మల్: విద్యార్థులు, యువ ఓటర్లలో ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించేందుకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో 009-నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్మల్ ఆర్డీవో, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి దేవిదాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పోటీల్లో మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు పాల్గొనాలని, విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పోటీలు నవంబర్ 13న ఉదయం 11 గంటలకు నిర్మల్‌లోని భాగ్యనగర్ నారాయణ హైస్కూల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు, పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎంపికైన విద్యార్థులను సకాలంలో పంపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.




