Nirmal: నిర్మల్ జిల్లాలో అధికారులను అడ్డుకున్న సారంగాపూర్ రైతులు!

Nirmal: స్వర్ణ ప్రాజెక్టు గేటు మరమ్మతులను అడ్డుకున్న రైతులు. వర్షాభావ సమయంలో పనులు చేస్తే ప్రాజెక్టు నీరు వ్యర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 11 Oct 2026 1:59 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లాలో అధికారులను అడ్డుకున్న సారంగాపూర్ రైతులు!

Nirmal: సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు జౌళినాల గేటు పనిచేయకపోవడంతో దానిని సరి చేసేందుకు వెళ్లిన నీటిపారుదల శాఖ అధికారులను రైతులు అడ్డుకున్నారు. గత ఆరు నెలల నుండి స్వర్ణ ప్రాజెక్టు కు చెందిన జౌళినాల గేటు పనిచేయడం లేదని, ప్రాజెక్టులో నీరు లేని సమయంలో ఎలా మరమ్మత్తులు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వర్ణ ప్రాజెక్టులో ఎల్ నినో ప్రభావంతో స్వర్ణ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో గేటును మరమ్మతు చేస్తే పూర్తిగా జౌళినాల ద్వారా నీరు వెళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు పేర్కొన్నారు. వర్షాకాల పంటల తరువాత గేటుకు మరమ్మత్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ స్వర్ణ ప్రాజెక్టులో వర్షాభావ ప్రభావంతో నీరు చేరలేదని దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులకు, ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి లేదన్నారు. అధికారులకు ఎన్నో రోజుల నుంచి మొరపెట్టుకుంటున్నా నీరు లేని సమయంలో మరమ్మత్తులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL