Nirmal: చేపల మార్కెట్లో జనాల జాతర
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బోయివాడ చేపల మార్కెట్ వద్ద మృగశిర కార్తెను పురస్కరించుకొని ప్రజలు భారీగా తరలివచ్చారు.
Nirmal: చేపల మార్కెట్లో జనాల జాతర
నిర్మల్ జిల్లా :కేంద్రంలో మృగశిర కార్తెను పురస్కరించుకొని చేపలు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మృగశిర కార్తె రోజున చేపలను తినడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందని ప్రజలు నమ్ముతారు.
చేపలను తినడం వలన ఆరోగ్యం బాగుండడంతోపాటు ఉబ్బుసం వ్యాధులు దూరం అవుతాయని వైద్యులు సైతం చెబుతుంటారు. ప్రతి ఏటా జూన్ మాసంలో వచ్చే మృగశిర కార్తె నాడు చేపలకు విపరీత గిరాకీ ఉంటుంది. దీంట్లో భాగంగానే నిర్మల్ జిల్లా కేంద్రంలోని బోయివాడ చేపల మార్కెట్ వద్ద చేపలు కొనడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఉదయం నుండి మార్కెట్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో లభించే వివిధ రకాల చేపలు మార్కెట్లో అమ్మకానికి ఉంచారు. ప్రతిరోజు మాదిరి కాకుండా కిలో 200 రూపాయలకు లభించే చేపలను 300కు విక్రయించారు. జిల్లా కేంద్రం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి చేపలు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు.
తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మృగశిర కార్తె నాడు చేపలు తినడం ఆనవాయితీ అని, ఈరోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందని, ఉబ్బసం వంటి వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చునని స్థానికులు తెలిపారు.




