Dasturabad: కొండపేటలో ‘పాలపిట్ట సంరక్షణ’పై అటవీశాఖ అవగాహన సదస్సు

Dasturabad: నిర్మల్ జిల్లా కొండపేటలో అటవీశాఖ అవగాహన సదస్సు. దసరా వేళ పాలపిట్టలను బంధిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలని అధికారుల హెచ్చరిక.

RAKESH N, KHANAPUR
Published on: 19 Oct 2026 5:21 PM IST
Dasturabad
X

Dasturabad: కొండపేటలో ‘పాలపిట్ట సంరక్షణ’పై అటవీశాఖ అవగాహన సదస్సు

దస్తురాబాద్: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం కేంద్రంలోని కొండపేట గ్రామంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మన రాష్ట్ర పక్షి అయిన, ప్రస్తుతం అంతరించిపోతున్న పాలపిట్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ ‘పాలపిట్టను సంరక్షిద్దాం’ అనే నినాదంతో గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

కడెం రేంజ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... దసరా పండుగ వేళ చూసేందుకు వీలుగా కొందరు పాలపిట్టలను వేటాడి, బోన్లలో బంధించి ప్రదర్శిస్తుంటారని, అలాంటి పనులకు పాల్పడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలపిట్టలను బంధించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

అనంతరం గ్రామంలో అవగాహన పోస్టర్లను విడుదల చేసి, ప్రజలకు కనిపించేలా గోడలపై అంటించారు. పర్యావరణ సమతుల్యతలో పక్షుల పాత్ర కీలకమని, వాటిని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది, కొండపేట గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR