Kubeer: ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు బోల్తా పడి నలుగురు మృతి
Kubeer: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం తొటాంబ దగ్గర జీపు టైరు పేలి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Kubeer: ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు బోల్తా పడి నలుగురు మృతి
కుబీర్: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం తొటాంబ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం కుబీర్ మండలం పార్డి కి చెందిన పలువురు శ్రావణ సోమవారం కావడంతో మహారాష్ట్రలోని పలు శైవ క్షేత్రాలను దర్శించుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో తొటాంబ గ్రామ సమీపంలో జీపు టైరు పేలడంతో ఒక్కసారిగా బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ తులసిరామ్, గంగన్న, గంగాబాయి లు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలు అయ్యారు. తీవ్ర గాయాల పాలైన వారిని స్థానికులు బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
Next Story




