Nirmal: నిర్మల్‌లో వైభవంగా జగన్నాథ రథయాత్ర

Nirmal: నిర్మల్‌లో అత్యంత వైభవంగా జగన్నాథ రథయాత్ర. స్వామివారి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 22 July 2026 7:59 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో వైభవంగా జగన్నాథ రథయాత్ర

నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ మురళి కృష్ణ ఆలయం నుండి నిర్వహించిన జగన్నాథ రథ యాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ రథ యాత్రలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.స్వామివారి రథయాత్ర లో భక్తులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ రథ యాత్ర గాంధీ చౌక్ మురళి కృష్ణ ఆలయం నుండి బుధవార్ పేట్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్, జయశంకర్ చౌక్, నగేశ్వర వాడ, చింతకుంట వాడ, టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా కొనసాగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, స్థానిక కౌన్సిలర్ లక్ష్మీ, పట్టణ కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story