Nirmal: కడెంలో కన్నులపండువగా పోచమ్మ తల్లి బోనాలు!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు భక్తిశ్రద్ధలతో మహిళలు బోనాలు ఎత్తి ప్రత్యేక పూజలు చేశారు.
Nirmal: కడెంలో కన్నులపండువగా పోచమ్మ తల్లి బోనాలు!
నిర్మల్ జిల్లా: కడెం మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కడెం గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ ఉత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా పోచమ్మ తల్లి ఆలయాన్ని పచ్చటి తోరణాలు, రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు
ఈ వేడుకల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన వస్త్రాలు ధరించి, ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టిన మహిళలు.. సాంప్రదాయబద్ధంగా బోనాలు వండారు. అనంతరం డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల గుండా బోనాలను తలపై ఎత్తుకుని ఊరేగింపుగా పోచమ్మ తల్లి ఆలయానికి తరలివచ్చారు.
ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కడెం గంగపుత్రుల సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పోచమ్మ తల్లి చల్లని చూపుతో గ్రామం అంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రత్యేకంగా పూజలు చేశారు....




