Nirmal: అర్హులందరికీ బ్యాంక్ రుణాలు అందించాలి ఎల్డీఎం రాంగోపాల్
Nirmal: నిర్మల్ జిల్లా భైంసాలో మండలస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించిన ఎల్డీఎం రాంగోపాల్. అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించాలని ఆదేశం.
Nirmal: అర్హులందరికీ బ్యాంక్ రుణాలు అందించాలి ఎల్డీఎం రాంగోపాల్
నిర్మల్: నిర్మల్ జిల్లా అర్హులైన పథకాలన్నీ లబ్ధిదారులకు చేరేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు రాంగోపాల్ అన్నారు. బుధవారం బైంసాలోని ఐకెపి హాలులో ఎల్డిఎం రామ్ గోపాల్ ఆధ్వర్యంలో మండలస్థాయి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఎల్డీఎం మాట్లాడుతూ, మండల పరిధిలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు, వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి కింద బ్యాంకుల ద్వారా అందించే ఆర్థిక సహాయంపై సుదీర్ఘంగా చర్చించారు. అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో బ్యాంక్ రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా చేయూత నందించాలని అధికారులకు, బ్యాంకర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.




