Nirmal: నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వైభవంగా మట్టి వినాయక నిమజ్జన శోభాయాత్ర!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే , తదితరులు పాల్గొని పూజలు చేశారు.
Nirmal: నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వైభవంగా మట్టి వినాయక నిమజ్జన శోభాయాత్ర!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మట్టి వినాయకుని నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. ఏడు రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న వినాయకున్ని అందంగా అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రతిష్టించి పట్టణంలోని పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా వినాయకునికి బీజే ఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి తో పాటు పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అతిథులకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. వినాయక శోభాయాత్రను పురస్కరించుకొని చేసిన నృత్యాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.




