Nirmal: కాసిన్ని రేషన్ బియ్యం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న ఆదివాసీలు!

Nirmal: నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఆదివాసీ గ్రామాల ప్రజలు రేషన్ సరుకుల కోసం ఉప్పొంగుతున్న కడెం వాగును నాటు పడవలపై దాటుతున్నారు.

RAKESH N, KHANAPUR
Published on: 7 Aug 2026 10:49 PM IST
Nirmal
X

Nirmal: కాసిన్ని రేషన్ బియ్యం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న ఆదివాసీలు!

నిర్మల్: నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఆదివాసీ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడెం, దొత్తి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులపై వంతెనలు లేకపోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

రేషన్ సరుకుల కోసం మండలంలోని వస్పల్లి, దొండారి, యాపలగూడ, రాంనగర్ గ్రామాల ప్రజలు తమ ప్రాణాలను చేతిలో పెట్టుకుని బయలుదేరారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కడెం వాగును దాటడానికి చిన్న నాటు పడవలు, కర్ర తెప్పలను ఆశ్రయించారు. రేషన్ బియ్యం బస్తాలను పడవలపై వేసుకుని, ప్రమాదకర స్థితిలో వాగు దాటారు.

కేవలం రేషన్ కోసమే కాకుండా.. అత్యవసర సమయాల్లో వైద్యం అందాలన్నా, నిత్యావసర సరుకులు తేవాలన్నా ఈ ప్రాణాంతక ప్రయాణం తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి వాగులపై వంతెనలు నిర్మించాలని, తమ కష్టాలను దూరం చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story