Nirmal: 25 ఆలయ చోరీల్లో నిందితుల అరెస్ట్ - రూ.లక్షల సొత్తు రికవరీ

Nirmal: నిర్మల్ జిల్లాలో దేవాలయాలు, ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 కిలోల వెండి, కారు, నగదు స్వాధీనం.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 5 Sept 2026 4:19 PM IST
Nirmal
X

Nirmal: 25 ఆలయ చోరీల్లో నిందితుల అరెస్ట్ - రూ.లక్షల సొత్తు రికవరీ

నిర్మల్: నిర్మల్ జిల్లాలో దేవాలయాలు, ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ జానకి షర్మిల జిల్లా పోలీసు కార్యాలయంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దొంగతనాల నివారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘టైగర్స్ టాస్క్ ఫోర్స్’ బృందం చోరీ కేసులపై ప్రత్యేక దృష్టి సాధించిందన్నారు. భైంసా ASP, నిర్మల్ DSP ఆధ్వర్యంలో సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలు, గత నేరాల వివరాలను విశ్లేషిస్తూ దర్యాప్తు చేపట్టారన్నారు.

ఈ కేసుల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు, వీరికి 25 దొంగతనాల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వీటిలో 16 కేసులకు సంబంధించిన చోరీ సొత్తును రికవరీ చేసినట్లు, మిగిలిన కేసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

ఈ కేసుల్లో మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, కల్గద్దవార్ శ్రీకాంత్, సారా సాయికిరణ్ అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్దనుండి అయ్యప్ప ఆలయంలో చోరీకి గురైన అమ్మవారి మూల విరాట కిరీటం, ఉత్సవమూర్తి వెండి కిరీటం, వినాయక కిరీటం రికవరీ చేసినట్లు తెలిపారు.

దీంతోపాటు నిర్మల్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆలయాల్లో చోరీకి గురైన సొత్తును రికవరీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. వీరి వద్ద నుండి నిస్సాన్ మాగ్నైట్ కారు, 12 కిలోల వెండి ఆభరణాలు, మెల్టింగ్ మిషన్, గ్యాస్ పైప్ మిషన్ తో పాటు 67 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ కేసుల ఛేదనలో కృషి చేసిన భైంసా ASP సాయి కిరణ్, నిర్మల్ DSP శ్రీనివాస్, CIలు కృష్ణ, సమ్మయ్య, SIలు లింబాద్రి, గణేష్, శ్రీకాంత్,అశోక్, ఎస్.కె. గఫార్, హెడ్ కానిస్టేబుల్ జగన్ సింగ్, PCలు తిరుపతి, సతీష్ తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story