Dasturabad: దస్తురాబాద్‌లో విస్తృత తనిఖీలు - డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

Dasturabad: నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో పోలీసులు రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్సై హెచ్చరించారు.

RAKESH N, KHANAPUR
Published on: 1 Sept 2026 9:22 PM IST
Dasturabad
X

Dasturabad: దస్తురాబాద్‌లో విస్తృత తనిఖీలు - డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

దస్తురాబాద్: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద రాత్రి వేళల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దస్తురాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. చౌరస్తా గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి, బ్రీత్ అనలైజర్ల ద్వారా వాహనదారులకు పరీక్షలు నిర్వహించారు.

ఎస్సై,పోలీస్ సిబ్బంది వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మీ ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.

పరిమితికి మించిన వేగంతో ప్రయాణించవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు నిద్రమత్తుగా అనిపిస్తే వాహనాలను పక్కన ఆపి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై సాయికుమార్ హెచ్చరించారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story