Dasthurabad: దేవునిగూడెంలో 'నిర్మల్ పోలీస్ - మీ పోలీస్' అవగాహన సదస్సు
Dasthurabad: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెంలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ మోసాలపై గ్రామీణులకు హెచ్చరికలు జేశారు.
Dasthurabad: దేవునిగూడెంలో 'నిర్మల్ పోలీస్ - మీ పోలీస్' అవగాహన సదస్సు
దస్తురాబాద్: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో పోలీసులు సరికొత్త భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టారు. 'నిర్మల్ పోలీస్ - మీ పోలీస్' కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేవునిగూడెం గ్రామంలో ప్రజలతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
దేవునిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక పోలీస్ అధికారులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కొత్తగా సీసీ కెమెరాల ఏర్పాటు, అలాగే ప్రస్తుతం పనిచేయని కెమెరాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టడంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో నిఘాను పెంచుకోవాలని సూచించారు.దీంతో పాటు ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంక్ వివరాలు చెప్పకూడదని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు, యువకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




