Nirmal: తానూరులో పత్తి చేలల్లో గంజాయి సాగు గుట్టురట్టు.. సీజ్

Nirmal: నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర శివారు పత్తి చేలల్లో గంజాయి సాగుపై పోలీసుల తనిఖీలు; మొక్కలు సీజ్ చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల వెల్లడి.

Srinivas, Mondol Bhainsa
Published on: 28 Nov 2026 4:31 PM IST
Nirmal
X

Nirmal: తానూరులో పత్తి చేలల్లో గంజాయి సాగు గుట్టురట్టు.. సీజ్

నిర్మల్: తానూరు మండలం బెంబర గ్రామ శివారులోని పత్తి చేలల్లో భారీ ఎత్తున గంజాయి సాగు జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీస్ గంజాయి గస్తీ లో భాగంగా తనికులు చేపట్టారు.పోలీసులు ఉదయం నుంచే గ్రామ శివారులో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో తనికులు చేపట్టారు.ఈ తనికిల్లో పత్తితో పెట్టిన గంజాయి మొక్కలను గుర్తించారు.జిల్లా ఎస్పీ జానకి షర్మిల క్షేత్రస్థాయికి చేరుకొని గంజాయి మొక్కలను పరిశీలించారు.

పక్క చేనులో ఉన్న ఎండిన గంజాయి మొక్కలను పరిశీలించారు.జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ పక్కా సమాచారం మేరకు మూడు చోట్ల గంజాయి మొక్కలను పెంచుతున్నారని సమాచారంతో తనిఖీలు చేపట్టి గంజాయి పంట ను గుర్తించామని,ఒక పంట చేనులో అమ్మకానికి పెట్టిన గంజాయి మొక్కలను గుర్తించమని వాటిని సీజ్ చేశామని,పంచనామా అయిన తరువాత వాటి విలువ వెల్లడిస్తామని అన్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa