Nirmal: నిర్మల్‌లో మార్మోగిన సాయి నామస్మరణ.. భక్తుల రద్దీ
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్‌లో నిర్వహించిన 'సాయి సంకీర్తన గానామృతం' భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
Nirmal: నిర్మల్‌లో మార్మోగిన సాయి నామస్మరణ.. భక్తుల రద్దీ
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ లో నిర్వహించిన సాయి సంకీర్తన గానామృతం భక్తులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంది. నిర్మల్ కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి శనివారం సాయంత్రం నిర్మల్ లోని ఆయా కేంద్రాలతో పాటు గ్రామ గ్రామాలలో సాయిబాబా పల్లకి ఊరేగింపు నిర్వహిస్తారు.
అనంతరం సాయి పారాయణాన్ని చేపడుతారు. ఈ సందర్భంగా భక్తులు ఆలపించిన సాయిబాబా భక్తి గేయాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతకుముందు సాయిబాబా చిత్రపటానికి, పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాయి పారాయణానికి నిర్మల్ జిల్లా కేంద్రం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అల్పాహారాన్ని అందజేశారు.
Next Story




