Nirmal: నిర్మల్‌లో ఘనంగా సాయి సంకీర్తన.. భక్తుల ఇళ్లల్లో ప్రత్యేక పూజలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్‌లో సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో సాయి సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తుల ఇళ్లల్లో ప్రతి శనివారం ఈ పూజలు నిర్వహిస్తామని లక్కడి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 30 May 2026 8:55 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఘనంగా సాయి సంకీర్తన.. భక్తుల ఇళ్లల్లో ప్రత్యేక పూజలు!

నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ బృందావన్ స్కూల్ ఎదురుగా గల సాయి భక్తుడు దొంతుల శాంతారావు నివాసంలో శనివారం సాయంత్రం సాయి సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సాయి పాదుకలు, సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయిబాబా ఆశీర్వచనాలు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండేవిధంగా సాయినాథుని చిత్రపటాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శనివారం సాయి భక్తుల ఇళ్లల్లో వారి కోరిక మేరకు సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు పండరి, ఉప్పుల నందు, రాజు, శ్రీనివాస్ వర్మ, రామరాజు, జిందం గోవర్ధన్, కోల శంకర్, రాజేష్, నారాయణరెడ్డి, సత్యం, కైలాసపతి, తిరుపతి, రేఖ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story