Nirmal: రైస్ మిల్లుల్లో విజిలెన్స్ దాడి రూ.14 కోట్ల ధాన్యం మాయం!

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా, ముధోల్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. మహాదేవాయ, జగదాంబిక మిల్లుల్లో రూ.14 కోట్లకు పైగా ధాన్యం కొరత గుర్తింపు.

Srinivas, Mondol Bhainsa
Published on: 3 Sept 2026 1:02 PM IST
Nirmal
X

Nirmal: రైస్ మిల్లుల్లో విజిలెన్స్ దాడి రూ.14 కోట్ల ధాన్యం మాయం!

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా పట్టణం మరియు ముధోల్ మండలo రెండు మిల్లుల్లో కలిపి దాదాపు రూ.14 కోట్లకు పైగా విలువైన ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది.భైంసా పట్టణంలోని కథ్గావ్‌ రహదారిలో ఉన్న మహాదేవాయ రైస్‌ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించగా, యాక్షన్‌ ప్యాడీ, సీఎంఆర్‌ ధాన్యం నిల్వల్లో రూ.7 కోట్లకు పైగా విలువైన ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది.

అదేవిధంగా ముధోల్‌ మండలం విట్టోలి గ్రామ సరిహద్దులోని శ్రీ జగదాంబిక రైస్‌ మిల్లులోనూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మిల్లులోనూ దాదాపు రూ.7 కోట్లకు పైగా విలువైన ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.రెండు మిల్లుల్లో గుర్తించిన ధాన్యం లోటుకు సంబంధించిన వివరాలను అధికారులు సంబంధిత జిల్లా అధికారులకు తెలియజేసినట్లు తెలిసింది.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa

Next Story