Nirmal: కడ్తల్ అయ్యప్ప ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు
Nirmal: నిర్మల్ నియోజకవర్గంలోని కడ్తాల్ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
Nirmal: కడ్తల్ అయ్యప్ప ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు
నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలోని కడ్తాల్ గ్రామంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి కోసం అనేక రోజులుగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు రూ.50 లక్షలు మంజూరు చేయడం జరిగిందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం అయ్యప్ప ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం రూ.39.81 లక్షల నిధులు నెట్ అమౌంట్‌గా మంజూరయ్యాయని పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో మార్కింగ్ పూర్తి చేసి, పనులను త్వరితగతిన ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు..
అదేవిధంగా ఆలయం పక్కన ఉన్న షెడ్ నిర్మాణం, అభివృద్ధి కోసం అదనపు నిధులను కూడా మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అనేక సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి సేవలో నిమగ్నమై ఉంటూ, ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నర్సారెడ్డి స్వామి, చిన్నయ్య స్వామి సేవలు అభినందనీయమని, ఆలయ అభివృద్ధికి వారు చేస్తున్న కృషి మరువలేనిదని ఎమ్మెల్యే కొనియాడారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ ప్రాంతంలోని అయ్యప్ప స్వాములకు సేవాభాగ్యాన్ని కల్పిస్తూ, ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, రమణా రెడ్డి, జమాల్,సరికేల గంగన్న సాదం అరవింద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి,మాజీ MPP హరీష్ రెడ్డి, సర్పంచ్ రాజు రెడ్డి, బీజేపీ నాయకులు జుట్టు దినేష్, కందుల హరీష్, అయ్యప్ప స్వాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




