Nirmal: ఆర్టీసీ బస్సులు, బోర్డులపై ఉర్దూ, ఆంగ్ల భాషలు రాయాలి: వినతి!

Nirmal: నిర్మల్ ఆర్టీసీ డిపో పరిధిలోని బస్సులు, బస్టాండ్ బోర్డులపై తెలుగుతో పాటు ఉర్దూ, ఆంగ్ల భాషలు రాయాలని కోరుతూ కలాం గుణం సొసైటీ నాయకులు డీఎం కల్పనకు వినతిపత్రం సమర్పించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 27 Nov 2026 1:43 PM IST
Nirmal
X

Nirmal: ఆర్టీసీ బస్సులు, బోర్డులపై ఉర్దూ, ఆంగ్ల భాషలు రాయాలి: వినతి!

నిర్మల్: నిర్మల్ డిపో పరిధిలోని బస్సులు, బస్టాండ్ ప్రాంగణాలు, ప్లాట్‌ఫామ్‌లు, సైన్ బోర్డులపై తెలుగుతో పాటు ఉర్దూ, ఆంగ్ల భాషలను కచ్చితంగా రాయాలని కోరుతూ శుక్రవారం ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పనకు వినతిపత్రం సమర్పించారు. కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా వ్యవస్థాపకులు అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ ఆదేశాల మేరకు నాయకులు ఈ వినతి అందించారు.

ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో సూచనలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారిక కార్యక్రమాలలో కూడా ఈ భాషలను వినియోగించాలని డిమాండ్ చేశారు. గతంలో పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని, వారం పది రోజుల్లో మార్పు రాకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. స్పందించిన డీఎం కల్పన ఉన్నతాధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం సొసైటీ బాధ్యులు ఆమెను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇంతియాజ్, జిల్లా కోశాధికారి శేఖ్ షాదుల్లా హుస్సేన్, పట్టణ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ కరీం, పట్టణ యువజన విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ మోసిన్, తాజీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL