Nirmal: నిర్మల్‌లో బోర్ మోటార్ వైర్ల దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు!

Nirmal: నిర్మల్ రూరల్ మండలం మూటపూర్ పరిధిలో జరిగిన బోర్ మోటార్ వైర్ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 23 May 2026 2:39 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో బోర్ మోటార్ వైర్ల దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు!

నిర్మల్: రూరల్ మండలం మూటపూర్ గ్రామ పరిధిలో జరిగిన బోర్ మోటార్ వైర్ల దొంగతనం కేసును నిర్మల్ రూరల్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి దొంగిలించిన సొత్తుతో పాటు నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే గత రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో మూటపూర్ గ్రామ పరిధిలో గుర్తుతెలియని దుండగులు సుమారు 340 మీటర్ల బోర్ మోటార్ వైర్లను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులకు అందిన సమాచారం మేరకు ఒక ఆటోలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీస్ బృందం చాకచక్యంగా వెంబడించి పట్టుకుంది. వారిని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించారు. నిర్మల్ లోని శాంతినగర్ కు చెందిన కడసు విష్ణువర్ధన్, కురన్నపేటకు చెందిన నల్లోళ్ల మహేష్ తోపాటు ఇద్దరు మైనర్ బాలురను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సమాచారం అందిన వెంటనే స్పందించి అత్యంత ప్రతిభావంతంగా నిందితులను పట్టుకుని కేసును ఛేదించిన నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్, రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, రూరల్ ఎస్సై లింబాద్రి లను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story