Nirmal: నిర్మల్ జిల్లాలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఆరు గేదెలు మృతి!

Nirmal: నిర్మల్ రూరల్ మండలం కౌట్లకే గ్రామంలో ఆదివారం భారీ వర్షానికి పిడుగు పడి సిద్దులకుంట రోడ్డులో ఆరు గేదెలు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 20 Sept 2026 2:13 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లాలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఆరు గేదెలు మృతి!

Nirmal: నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్లకే గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షంలో పిడుగు పడి ఆరు గేదెలు మృతి చెందాయి. సిద్దులకుంట రోడ్డులో ఉన్న పశువుల మందలో ఉన్న ఈ గేదెలపై పిడుగు పడడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాయి. భారీ శబ్దంతో పిడుగు పడడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. మందలో ఉన్న బర్లు భయంతో పరుగులు తీశాయని ప్రత్యక్ష శాశ్వతం తెలిపారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL