Nirmal: నిర్మల్‌లో అర్ధరాత్రి దారుణం.. 200 ఎకరాల్లో ఎగిసిపడిన మంటలు!
Nirmal: నిర్మల్ జిల్లా సోన్ మండలంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.
Nirmal: నిర్మల్‌లో అర్ధరాత్రి దారుణం.. 200 ఎకరాల్లో ఎగిసిపడిన మంటలు!
నిర్మల్: సోన్ మండల కేంద్ర శివారులో వరి కొయ్యలకు సోమవారం అర్థరాత్రి నిప్పు అంటుకుంది. అదే సమయంలో ఈదురు గాలులు వీయడంతో సోన్ - కూచన్పల్లి గ్రామాల మధ్య సుమారు 200 ఎకరాల్లోని పంటల వ్యర్థాలకు మంటలు విస్తరించాయి. దీంతో పంట చేలలో ఉన్న మోటార్లు, విద్యుత్ తీగలు, బోరు బావులు కాలిపోయాయి. ఒకరిద్దరు రైతుల కోయని పంట కూడా ఆహుతైనట్లు సమాచారం. నిప్పంటించిన మంటలకు తోడు ఈదురు గాలులు వీయడంతో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగి పంట వ్యర్థాలతోపాటు బోరు మోటార్లు, వైర్లు కాలిపోయినట్లు తెలుస్తోంది.
Next Story




