Nirmal: అమరవీరుల కుటుంబాలకు ‘TG వీర్ ఫ్యామిలీ కార్డులు’ ఎస్పీ జానకి షర్మిల!
Nirmal: నిర్మల్ జిల్లాలో పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ‘TG వీర్ ఫ్యామిలీ కార్డులు’ పంపిణీ చేసిన ఎస్పీ జానకి షర్మిల.
Nirmal: అమరవీరుల కుటుంబాలకు ‘TG వీర్ ఫ్యామిలీ కార్డులు’ ఎస్పీ జానకి షర్మిల!
Nirmal: పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ద్వారా అందే సంక్షేమ ప్రయోజనాలను సులభంగా పొందేందుకు ఈ కార్డు, సంబంధిత పోర్టల్ ఉపయోగపడతాయని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు TG వీర్ ఫ్యామిలీ కార్డుల కార్డులను ఆమె అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు సేవలో అమరులైన కుటుంబాలకు అందాల్సిన సేవలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను నమోదు చేయడంతో పాటు, వాటి పురోగతిని సులభంగా ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆర్థిక సహాయం, పింఛన్లు, కారుణ్య నియామకాలు, ప్లాట్ లేదా ఇంటి స్థల కేటాయింపులు తదితర అర్హతగల సంక్షేమ ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని క్రమబద్ధంగా నమోదు చేసి, వాటి స్థితిని తెలుసుకునే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారన్నారు.
అమరవీరుల సేవా వివరాలు, కుటుంబ వివరాలు, సంక్షేమ ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని కేంద్రీకృత రికార్డుగా నిర్వహించడం ద్వారా వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే TG వీర్ ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.
తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్, IPS ఆదేశాల మేరకు ఆగస్టు 2026లో ఈ కార్యక్రమానికి సంబంధించిన చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమన్నారు. వారి కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అర్హతగల సంక్షేమ ప్రయోజనాలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భైంసా ASP సాయి కిరణ్, IPS, నిర్మల్ DSP శ్రీనివాస్, AO ఎండి. యూనస్ అలీ, CIలు కృష్ణ, సమ్మయ్య, సత్యనారాయణ, RIలు రాంనిరంజన్, రామకృష్ణ, SI లింబాద్రి, RSIలు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు సాయి కుమార్, సాయి కృష్ణ RSI, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, DPO సిబ్బంది పాల్గొన్నారు.




