Nirmal: బాధితులకు తక్షణ న్యాయం అందించాలన్న ఎస్పీ జానకి షర్మిల!
Nirmal: భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించిన నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల. బాధితుల ఫిర్యాదులపై తక్షణ చర్యలకు ఆదేశం.
Nirmal: బాధితులకు తక్షణ న్యాయం అందించాలన్న ఎస్పీ జానకి షర్మిల!
Nirmal: నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ ఓర్పుగా విని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు.
ఫిర్యాదుదారుల సమక్షంలోనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి, సమస్యలపై చట్టపరమైన చర్యలు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఆదేశించారు.
కుటుంబ సమస్యల పరిష్కారానికి కౌన్సిలింగ్
గ్రీవెన్స్ డేకు వచ్చిన కొన్ని కుటుంబ వివాదాలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పరస్పర అవగాహన కల్పించడం ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. భైంసాలోనే కౌన్సిలింగ్ సదుపాయం కల్పించడం పట్ల బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.
పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష
గత గ్రీవెన్స్ డేల్లో అందిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని ఎస్పీ సమీక్షించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, వాటిని వేగంగా పరిష్కరించి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు గ్రీవెన్స్ డే కార్యక్రమం ఉపయోగకరంగా నిలుస్తోందని తెలిపారు.




