Nirmal: బాసర జోన్ క్రికెట్ ప్రాక్టీస్ మీట్‌ను ప్రారంభించిన ఎస్పీ జానకి షర్మిల!

Nirmal: నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాసర జోన్ క్రికెట్ ప్రాక్టీస్ మీట్‌ను ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ పోటీలకు ఎంపికలు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 6 Nov 2026 1:45 PM IST
Nirmal
X

Nirmal: బాసర జోన్ క్రికెట్ ప్రాక్టీస్ మీట్‌ను ప్రారంభించిన ఎస్పీ జానకి షర్మిల!

Nirmal: నిర్మల్ పట్టణ శివారులో గల క్రికెట్ అకాడమీ మైదానంలో త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ కోసం బాసర జోన్ క్రికెట్ ప్రాక్టీస్ మీట్ ను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన పోలీసు శాఖ సిబ్బంది రెండు రోజులపాటు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు.

ప్రాక్టీస్ మ్యాచ్లలో ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయి టీంకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. బాసర జోన్ పోలీసులు క్రీడా పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL