Nirmal: నిర్మల్‌లో ఘనంగా హజ్రత్ ఇబ్రహీం దౌలా ఉర్స్ షరీఫ్ వేడుకలు!

Nirmal: నిర్మల్ శరత్ మహల్ మస్జిద్-ఎ-ఖుబాలో హజ్రత్ ఇబ్రహీం దౌలా ఉర్స్ షరీఫ్ వేడుకలు.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎస్పీ డా. జి. జానకి షర్మిల.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 19 Sept 2026 4:05 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఘనంగా హజ్రత్ ఇబ్రహీం దౌలా ఉర్స్ షరీఫ్ వేడుకలు!

Nirmal: నిర్మల్‌లోని శరత్ మహల్ ప్రాంతంలోని మస్జిద్-ఎ-ఖుబా వద్ద నిర్వహించిన పవిత్ర సందల్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మసీదు కమిటీ సభ్యులు ఎస్పీని శాలువాతో ఘనంగా సత్కరించారు.

సందల్ వేడుకలు మత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ఎస్పీ పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ ప్రశాంతంగా, సోదరభావంతో వేడుకలను నిర్వహించుకోవాలని కోరారు. ఈ ప్రార్థనల్లో డీఎస్పీ పి. శ్రీనివాస్, సీఐలు కృష్ణ, సమ్మయ్య, గోవర్ధన్, ఎస్‌ఐలు గణేష్, శ్రీకాంత్, లింబాద్రి, గోపీ, ఆర్‌ఎస్‌ఐ రవి కుమార్, మసీదు కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL