Nirmal: ఖానాపూర్‌లో ఎంజేపీ గురుకుల విద్యార్థుల ఆందోళన!

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎంజేపీ గురుకులంలో పీటీ సార్ వేధింపులకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. ప్రిన్సిపాల్ హామీతో నిరసన విరమణ.

RAKESH N, KHANAPUR
Published on: 7 Oct 2026 1:35 PM IST
Nirmal
X

Nirmal: ఖానాపూర్‌లో ఎంజేపీ గురుకుల విద్యార్థుల ఆందోళన!

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. మహాత్మా జ్యోతిబా పూలే (MJP) గురుకుల కళాశాల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి భారీ ఆందోళనకు దిగారు. కళాశాలలో పనిచేస్తున్న పీటీ సార్ తమను అకారణంగా వేధిస్తున్నాడంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.

తమను ఇష్టానుసారంగా గోడ కుర్చీలు వేయిస్తూ, వంగబెట్టి దారుణంగా కొడుతున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పీటీ సార్ వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, వెంటనే అతనిని ఇక్కడి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ రహదారిపై నిరసన చేపట్టారు.

విద్యార్థుల ఆందోళనతో రంగంలోకి దిగిన కళాశాల ప్రిన్సిపాల్.. విద్యార్థులతో మాట్లాడి వివరణ ఇచ్చారు. ఈ దసరా సెలవుల తర్వాత సదరు పీటీ సార్‌ను వెంటనే విధుల నుంచి తొలగిస్తామని విద్యార్థులకు గట్టి హామీ ఇచ్చారు. పీటీ స్థానంలో కొత్త పీడీ సార్‌ను నియమించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించామని, దసరా హాలిడేస్ ముగియగానే కొత్త సార్ వస్తారని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.

ఇలాంటి సంఘటనలు కళాశాలలో మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించి తిరిగి కళాశాలకు వెళ్లారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR