Nirmal: నిర్మల్‌లో ఘనంగా సాయి సంకీర్తన
Nirmal: వెంకటాపూర్ కాలనీలో గల సాయి భక్తుడు సాదు సాయినాథ్ రెడ్డి నివాసంలో సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో సాయి సంకీర్తన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.
Nirmal: నిర్మల్‌లో ఘనంగా సాయి సంకీర్తన
నిర్మల్ జిల్లా: కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో గల సాయి భక్తుడు సాదు సాయినాథ్ రెడ్డి నివాసంలో సాయి సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సాయి పాదుకలు, సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం సాయిబాబా ఆశీర్వచనాలు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండేవిధంగా సాయినాథుని చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శనివారం సాయి భక్తుల ఇళ్లల్లో వారి కోరిక మేరకు సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామన్నారు.
గత కొన్ని వారాలుగా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఇళ్లల్లో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకొని సాయి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు పండరి, ఉప్పుల నందు, రాజు, శ్రీనివాస్ వర్మ, లింగారెడ్డి, కోల శంకర్, గోపాల్ రెడ్డి జొన్నల మనోహర్, మహేందర్ యాదవ్, సుదర్శన్, అజయ్ నారాయణరెడ్డి, సత్యం, శ్రీనివాస్ కైలాసపతి, తిరుపతి, రేఖ, మాధవి, రాణి తదితరులు పాల్గొన్నారు.




