Nirmal: ఐఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్‌లైన్‌లోనే బిల్లుల సమర్పణ ట్రెజరీ అధికారి!
Nirmal: నిర్మల్ జిల్లాలో ఆగస్టు 15 నుంచి ఐఎఫ్ఎంఎస్ ద్వారా పేపర్‌లెస్ బిల్లుల విధానాన్ని అమలు చేయాలని జిల్లా ఖజానా అధికారి సరోజ తెలిపారు.
Nirmal: ఐఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్‌లైన్‌లోనే బిల్లుల సమర్పణ ట్రెజరీ అధికారి!
Nirmal: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన కాగిత రహిత విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐఎఫ్ఎంఎస్ ద్వారా పేపర్‌లెస్ బిల్లుల సమర్పణ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని జిల్లా ఖజానా అధికారి సరోజ ఒక ప్రకటనలో తెలిపారు.
ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆదేశానుసారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధిన బిల్లులన్నిటినీ ఆగస్ట్ 15 వ తేదీ నుండి ఆన్లైన్ లో మాత్రమే సమర్పించాలని ఆమె వివరించారు. ఈ విధానం అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
జిల్లా లోని అందరూ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్(DDOs) ఇకపై బిల్లులను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలన్నారు. బిల్లులతో పాటు అవసరమైన స్కాన్ చేసిన ఆధార పత్రాలను తప్పనిసరిగా జత చేయాలి అని తెలిపారు. సమర్పించే పత్రాలన్నీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం - 2000 ప్రకారం చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకంతో ధృవీకరించాలని పేర్కొన్నారు.
15 ఆగస్టు 2026 నుంచి ట్రెజరీ కార్యాలయాలకు హార్డ్ కాపీ బిల్లులను (కాగిత రూపంలో) సమర్పించరాదని వివరించారు. జిల్లాలోని అన్ని ఉపకోశాధికారి కార్యాలయ అధికారులు (ఎస్టీవో) తమ పరిధిలోని అన్ని కార్యాలయాలకు ఈ ఆదేశాలను తెలియజేసి అమలు చేయాలి అని ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆమోద ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించబడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.




