Boath: ఉమ్రి (బి) రామాలయ భూమి కబ్జాపై ప్రజావాణిలో ఫిర్యాదు!

Boath: గుడిహత్నూర్ మండలం ఉమ్రి (బి) రామాలయానికి చెందిన 10 ఎకరాల భూమి అక్రమ కబ్జాపై తహసీల్దార్‌కు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గ్రామస్థులు.

NAGULA SATISH, BOATH
Published on: 7 Sept 2026 4:57 PM IST
Boath
X

Boath: ఉమ్రి (బి) రామాలయ భూమి కబ్జాపై ప్రజావాణిలో ఫిర్యాదు!

Boath: గుడిహత్నూర్ మండలం ఉమ్రి (బి) గ్రామ శివారులోని అతి పురాతన శ్రీరామ మందిరానికి చెందిన 10 ఎకరాల భూమి అక్రమ కబ్జాకు గురికావడం పై సోమవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కు అలాగే MPDO ఆఫీసులో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు, మహారాష్ట్రకు చెందిన ఏక్‌నాథ్ మహరాజ్ ఈ భూమిని అక్రమంగా పట్టా చేయించుకోగా, అతని శిష్యుడు అర్జున్ నారాయణ్ హల్నోర్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ఉమ్రి (బి), సూర్యగూడ, సోయంగూడ గ్రామాల ప్రజలు ఏకమై అత్యవసర గ్రామసభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ ​మేరకు ప్రజావాణి కార్యక్రమంలో ఆలయ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

10 ఎకరాల అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేసి భూమిని తిరిగి ఆలయ ట్రస్ట్ పేరిట నమోదు చేయాలని, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం అక్రమ కట్టడాలను కూల్చివేసి అర్జున్ హల్నోర్‌ను గ్రామ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లో తహసీల్దార్ స్పందించి న్యాయం చేయకపోతే కలెక్టర్, ఎస్పీలను కలిసి వేలాది మంది భక్తులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆర్క భరత్ కుమార్, ఉర్వేత బాపురావు, నజీయ రహీం, ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు రాయిసిడం జంగు పటేల్, మాజీ సర్పంచ్ సోయం బోజ్జు తదితరులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story