Nirmal: హత్య కేసు నిందితుడి అరెస్ట్.. 1.4 కిలోల బంగారం, నగదు స్వాధీనం!
Nirmal: యాదాద్రి జిల్లాలో హత్య చేసి పారిపోతున్న నిందితుడిని నిర్మల్ జిల్లా పోలీసులు సోన్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు.
Nirmal: హత్య కేసు నిందితుడి అరెస్ట్.. 1.4 కిలోల బంగారం, నగదు స్వాధీనం!
Nirmal: జోగినిని హత్య చేసి పారిపోతున్న నిందితులను నిర్మల్ జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అర్ధరాత్రి సమయంలో జోగిని సుధాకర్ స్వామి అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి, అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, వెండి, నగదు, హరియర్ కారును అపహరించి మధ్యప్రదేశ్‌కు పారిపోతున్న నిందితులను జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి నిర్మల్ జిల్లా పోలీసులకు సమాచారం అందడంతో రాత్రి విధుల్లో ఉన్న నిర్మల్ రూరల్ ఎస్‌ఐ లింబాద్రి, పోలీసు సిబ్బంది శ్రీనివాస్, సూర్యభాను, రఘు, శ్రీధర్‌లతో కలిసి సోన్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 1.4 కిలోల బంగారం, 3 కిలోల వెండి, రూ.9 లక్షల నగదు మరియు హరియర్ కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం యాదాద్రి జిల్లా పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పట్టుకున్న నిర్మల్ రూరల్ ఎస్‌ఐ లింబాద్రి, పోలీసు సిబ్బందిని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించారు.




