Mandamarri: రగిలిన అన్నదాతల ఆగ్రహం కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాల దహనం

Mandamarri: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం ఐకేపీ సెంటర్‌లో ధాన్యం కొనుగోలు ఆలస్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 May 2026 2:21 PM IST
Mandamarri
X

Mandamarri: రగిలిన అన్నదాతల ఆగ్రహం కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాల దహనం

మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామ ఐకెపి సెంటర్ లో వడ్ల బస్తాలను తగలబెట్టి నిరసనకు దిగారు రైతులు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకువచ్చి నెల రోజులు దాటినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో ధాన్యం తడవగా మళ్లీ ఆరబెట్టి మాయిచ్చర్ వచ్చేలా చేసినప్పటికీ కొనుగోలు జరగడం లేదంటున్నారు.

ఐకెపి సెంటర్ రాగడి భూమిలో ఉండడంతో తేలికపాటి వర్షం పడ్డా కూడా లారీలు కాంట వేసిన ధాన్యాన్ని తీసుకుపోవడం కష్టతరమవుతుందని అధికారులు సకాలంలో స్పందించి ధాన్యాన్ని తూకం వేయాలని కోరుతున్నారు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒక్కో రైతు 3 లక్షల నుండి 5 లక్షల మేర నష్టపోయారన్నారు. మిల్లర్లు,,దళారులు,, కొంతమంది అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మిల్లర్లు తమ దందాను ఆపి వడ్లను టైం కి డంపు చేసుకోవాలని కోరారు. అధికారులు స్పందించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story