Kagaznagar: ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అతిథిగా హాజరైన కోదండరాం!

Kagaznagar: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పటేల్ గార్డెన్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.

LALITH KUMAR, SIRPUR
Published on: 26 July 2026 8:37 PM IST
Kagaznagar
X

Kagaznagar: ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అతిథిగా హాజరైన కోదండరాం!

కగజనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ జేఏసీ ఛైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం తెలంగాణ ఉద్యమ విలువలు, భవిష్యత్ బాధ్యతలపై ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. తెలంగాణ జేఏసీ ఛైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story