Adilabad: ఆదిలాబాద్ టూరిజంపై వీడియోలు తీస్తే భారీ బహుమతులు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ, ఫారెస్ట్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 19 May 2026 3:30 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ టూరిజంపై వీడియోలు తీస్తే భారీ బహుమతులు!

ఆదిలాబాద్: ఆదివాసీ, ప్రకృతి, ఆలయాలు, ఫారెస్ట్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మావలలో హరితవనంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పర్యటక ప్రాంతాలపై ఇన్‌ఫ్లూయెన్సర్‌లు వీడియోలు తీసి డిపిఆర్ఓ ఆఫీసులో సబ్మిట్ చేస్తే ఉత్తమ వీడియోలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు.

గోండు రాజుల కోట, కుంటాల జలపాతం, మావల హరితవనం పార్క్ అభివృద్ధికి నిధులు సైతం మంజూరైనట్లు పేర్కొన్నారు. అనంతరం మావల హరిత వనంలో సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ అటవీ క్షేత్రాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, జిల్లా టూరిజం ఆఫీసర్ రవికుమార్, అధికారులు మనోహర్ తదితరులు ఉన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story