Adilabad: అదిలాబాద్ లో రాజీవ్ గాంధీ జ్యోతి యాత్రకు ఘన స్వాగతం
Adilabad: తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ నుండి ఢిల్లీ వరకు సాగుతున్న రాజీవ్ గాంధీ జ్యోతి యాత్రకు ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
Adilabad: అదిలాబాద్ లో రాజీవ్ గాంధీ జ్యోతి యాత్రకు ఘన స్వాగతం
Adilabad: తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుండి ఢిల్లీలోని వీర్ భూమి వరకు కొనసాగుతున్న రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర కు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిసిసి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్, మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు దేశానికి చేసిన సేవలు మరువలేవని దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారని ఆయన చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరనిలోటని ఆయన స్మృతిలో తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ నుండి ఢిల్లీలోని వీర భూమి వరకు రాజీవ్ గాంధీ జ్యోతి యాత్రను నిర్వహిస్తున్న శామ్యూల్ ద్రవ్యమ్ గారికి ఆయన బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఆదిలాబాద్ పట్టణ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ గారు,ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిజర్ పాషా గారు, టీటీడీ బోర్డు మాజీ మెంబర్ బెజ్జంకి అనిల్ పాల్గొన్నారు.




