Adilabad: మాజీ ఎంపీ సోయం బాపూరావుపై అనుచిత పోస్టులు ఎస్పీకి ఫిర్యాదు
Adilabad: మాజీ ఎంపీ సోయం బాపూరావుపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాంజీ గోండ్ సేవా సమితి డిమాండ్ చేసింది.
Adilabad: మాజీ ఎంపీ సోయం బాపూరావుపై అనుచిత పోస్టులు ఎస్పీకి ఫిర్యాదు
ఆదిలాబాద్: ఆదివాసి మనోభావాలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రాంజీ గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కుంర జంగు అన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో మాజీ ఎంపీ సోయం బాపూరావు పై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ కు వినతి పత్రం అందజేశారు. ఆదివాసుల మనో ధైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు.
Next Story




