Kadem: నిర్మల్‌లో కిలో రూ. 2.5 లక్షల మామిడి!

Kadem: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'జపాన్ మియాజాకి' మామిడి పండ్లను పండిస్తున్న నిర్మల్ జిల్లా నవపేట్ రైతు రాపెల్లి సత్యం.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 30 May 2026 2:33 PM IST
Kadem
X

Kadem: నిర్మల్‌లో కిలో రూ. 2.5 లక్షల మామిడి!

కడెం: నిర్మల్ జిల్లాలో కడెం మండలం నవపేట్ గ్రామంలో అరుదైన జపాన్ మియాజాకి రకం పండ్లు డిమాండ్ ధర పలుకుతుంది. జపాన్ మియాజాకి రకం మామిడి పండ్లకు ప్రపంచ దేశాల్లో కిలో రూ.2.5 లక్షల పలుకుతున్నాయి. రాపెల్లి సత్యం వ్యవసాయ క్షేత్రంలో ఈ రకం మామిడి కాయలు కాస్తున్నాయి.ఒక్కో పండు సుమారు 200 గ్రాముల నుంచి 350 బరువు ఉండగా, ఈ రకం మామిడి పండ్లు ఎరుపు, ఊదా రంగులో మెరుస్తూ కనిపిస్తున్నాయి.

వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో, పలువురు రైతులు మామిడి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు.. ఇవి జపాన్‌లోని మియాజాకి ప్రాంతంలో ఎక్కువగా పండుతాయి. అక్కడి నుంచి విత్తనాలు తెప్పించి సాగు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. సాధారణ మామిడి కంటే 8 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ పండ్లు చాలా తియ్యగా, తక్కువ పీచు కలిగి ఉంటాయి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

దాన్ని ఏమంటారు ఈ రకం మామిడి మొక్కకు రూ.10 వేలు ఖర్చు చేసి తెప్పించినట్లు రైతు సత్యం తెలిపారు. ఆయన ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ రకం మామిడి సాగు విస్తరిస్తోంది. ఒక్కో చెట్టుకు సుమారు 15-20 కాయలు కాస్తాయని, ఈ ఏడాది 25 కాయలు వచ్చాయని చెప్పారు. ఈ పండ్లతో ఈ క్రమంలో ఈ ప్రాంతంలో తోటలకు డిమాండ్ పెరుగుతోంది.. మొదటి మామిడి పండ్లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడల బుజ్జి పటేల్ కు సదర్ రైతు అందించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈ పంట సాగు చేస్తున్న రైతును అభినందించారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story