Adilabad: ఆదిలాబాద్‌లో కమలం జోరు.. బీజేపీలోకి క్యూ కట్టిన రిటైర్డ్ ఉద్యోగులు!
Adilabad: ఆదిలాబాద్‌లో బీజేపీలోకి భారీగా చేరికలు. ప్రధాని మోదీ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరిన విశ్రాంత ఉద్యోగులు.
Adilabad: ఆదిలాబాద్‌లో కమలం జోరు.. బీజేపీలోకి క్యూ కట్టిన రిటైర్డ్ ఉద్యోగులు!
Adilabad: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ.. ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ లో చేరడానికి ముందుకు వస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు బీజేపీ లో చేరారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆదిలాబాద్ పార్లమెంట్ కీలకపాత్ర పోషించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఏ విధంగా అయితే పశ్చిమ బెంగాల్లో బిజెపి ఘన విజయం సాధించిందో తెలంగాణలో సైతం విజయం సాధించాలని చాలామంది బిజెపిలో చేరుతున్నారని అన్నారు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బిజెపి అని పేర్కొన్నారు. బిజెపిలో చేరిన విశ్రాంత ఉద్యోగులకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు ఘటిక క్రాంతి, జోగు రవి, తాటిపల్లి రాజు, ఆత్రం సాయి , సతీష్ యాదవ్ తదితరులున్నారు.




