Kagaznagar: బండి భగీరథ్ అరెస్టు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్
Kagaznagar: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
Kagaznagar
Kagaznagar: బండి సంజయ్ కుమారుడు భగీరథ పై నమోదైన ఫోక్సో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషను లో సాయి భగీరథ పై కేసు పెట్టడానికి వెళ్ళిన బాధితుల కు పోలీసు కంప్లైట్ తీసుకోలేదు, తరువాత నిరసనల నేపథ్యంలో తరువాత కేసు నమోదు చేసారు.
బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ దొరకకుపోతే వాల్ పోస్టర్లు రాష్ట్రం అంతటా అతకపెట్టి పట్టుకోవాలి, పోలీసులు వెంటనే బండి సాయి భగీరథ ను అరెస్టు చేయాలి..
మైనర్ బాలిక కుటుంబ సభ్యులు పెట్టిన ఈ కేసు ను తప్పుదోవ పట్టించడానికే బండి సంజయ్ కుమారుడు భగీరథ కరీంనగర్ లో సదరు బాలిక, కుటుంబ సభ్యుల పై ఫిర్యాదు చేసాడు, వెంటనే కేసు నమోదు చేసారు. మైనర్ బాలిక పై హనీ ట్రాప్ కేసు పెట్టడానికి బండి సంజయ్ కి మనస్సు ఎలా వచ్చింది.
నేరం చేసిన కొడుకు ను బండి సంజయ్ దండించకుండా పక్కదోవ పట్టిస్తున్నాడు.
చిన్న చిన్న కేసులలో వెంట వెంటనే అరెస్టు చేస్తారు, ఒక చిన బాలిక మొయినాబాద్ ఫాంహౌజ్ లో ఆగాయిత్యం చేసాడని కంప్లైట్ ఇచ్చానా అరెస్టు చేయడం లేదు స్పందించలేదు. బండి భగీరథ కుమారుడి ఫోక్సో కేసులో అక్కడి పోలీసులను సస్పెండ్ చేయాలి.
ఫోక్స్ కేసు పెట్టిన కుటుంబం పై బట్టకాల్చీ మీద వేస్తున్నారు.. వారిని వేదింపులకు గురి చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ కుమారుడు భగీరథ పై పోక్సో కేసు పై స్పందించకు పోవడంలో అర్థం ఏంటీ, లోప లోపల ఒప్పందం ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుపాల్సిందే..
కేంద్ర మంత్రి అమీత్ షా గారు వెంటనే బండి సంజయ్ ను కేంద్రమంత్రి పదవి నుండి తప్పించాలి.
బిజెపి లో ఉండే మహిళా నాయకురాలు నిజనిజల కోసం స్పందించి బాధిత కుటుంబానికి బాసటగా నిలవాలి..
బండి భగీరథ ను వెంటనే అరెస్టు చేయాలని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు..




